ఎన్టీఆర్ వివాదం : పోరాటం సరే పరువు పోయిందిగా ?

ఏపీలో ఎప్పుడు ఏదో ఒక సంచలనం సృష్టిస్తునే వార్తల్లో ఉంటుంది ఏపీ అధికార పార్టీ వైసిపి.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వివాదాస్పదం అయ్యాయి.

 Ntr Controversy: The Fight Is Okay But The Honor Is Lost Ntr, Chandrababu, Cbn,-TeluguStop.com

 ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు.దీనిపై టిడిపి మొదటి నుంచి పోరాటాలు చేస్తూనే వస్తుంది.

తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా ఏపీ అసెంబ్లీలో బిల్లును పాస్ చేయడం,  అది ఆమోదం పొందడంతో ఏపీ వ్యాప్తంగా రచ్చ మొదలైంది.  ముఖ్యంగా టిడిపి శ్రేణులు ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పై ప్రత్యేక విమర్శలు మొదలుపెట్టింది.

అలాగే ఎన్టీఆర్ అభిమానులు సైతం ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

    అయితే ఆ విమర్శలను వ్యూహాత్మకంగా తిప్పుకొట్టడంలో వైసిపి సక్సెస్ అయ్యింది.

ఎన్టీఆర్ విషయంలో అభిమానం చాలా ఉందని,  అందుకే కృష్ణా జల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టామని,  కానీ టిడిపి అధినేత చంద్రబాబుకు ఆ చిత్త శుద్ధి లేదని, అందుకే ఎన్టీఆర్ పై చెప్పులు దాడి చేయించారని,  పార్టీ నుంచి దూరం చేసి లాక్కున్నారని వైసిపి ఎదురుదాడి మొదలు పెట్టడంతో పాటు,  సోషల్ మీడియాలోనూ గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య జరిగిన వివాదాలను,  అప్పటి పేపర్ క్లిప్పింగ్స్ ను హైలెట్ చేస్తూ టిడిపి , పార్టీకి మద్దతు ఇస్తున్న మీడియాను టార్గెట్ చేసుకుని వైసిపి విమర్శలు మొదలుపెట్టింది.
   

Telugu Chandrababu, Jagan, Ntr, Ysrcp-Politics

  అప్పట్లో ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని , కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ కుమారులు,  కుమార్తెలు ఎవరు స్పందించలేదని , పైగా చంద్రబాబుకు మద్దతు పలికారని,  కానీ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు అంటూ ఎదురు దాడి వైసిపి చేస్తోంది.ఇక జూనియర్ ఎన్టీఆర్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని బ్యాలెన్స్ చేస్తూ తటస్థంగా స్పందించడం పైన టిడిపి విమర్శలు చేయడంపై ఎన్టీఆర్ మద్దతుదారులు టిడిపి పై విమర్శలు చేస్తున్నారు.దీంతో అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం పక్కకు వెళ్లి గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు కారణంగా ఏ స్థాయిలో ఇబ్బందులు పడ్డారు అనే విషయం హైలెట్ గా మారి ఇప్పుడు దానిపైనే వివాదాలు నడుస్తున్నాయి .మంత్రుల సైతం బాలకృష్ణను చంద్రబాబును టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున చేస్తున్న కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube