ఆమెకు ఓట్లు వేయకండ్రా బాబు.. ఆ కంటెస్టెంట్ పై జెస్సీ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్న సంగతి తెలిసిందే.ప్రతి వారం రేటింగ్స్ అంతకంతకూ తగ్గుతుండటంతో బిగ్ బాస్ నిర్వాహకులు సైతం తల పట్టుకునే పరిస్థితి నెలకొందని సమాచారం.

 Bigg Boss Jessies Shocking Comments Goes Viral In Social Media , Bigg Boss , Big-TeluguStop.com

అయితే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లలో ఒకరైన జెస్సీ తాజాగా బిగ్ బాస్ షో సీజన్6 గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

అడవిలో ఆట టాస్క్ సమయంలో ఆరోహీ రావు, నేహా చౌదరి బొమ్మలను దాచిపెట్టి రేవంత్ గెలవకుండా చేయడం తన దృష్టిలో కరెక్ట్ కరెక్ట్ కాదని జెస్సీ తెలిపారు.

గీతూ రాయల్ గురించి జెస్సీ మాట్లాడుతూ ఆమెకు ఓట్లు వేయవద్దని నెటిజన్లను కోరుతున్నానని జెస్సీ చెప్పుకొచ్చారు.ఆమెను పంపించేయండని ఆమెను సేవ్ చేయకండని నెటిజన్లను కొరుతున్నానని జెస్సీ కామెంట్లు చేయడం గమనార్హం.

సాధారణంగా ఎవరైనా బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి పాజిటివ్ గా చెప్పడం జరుగుతుంది.అయితే జెస్సీ విషయంలో అందుకు భిన్నంగా జరగడం గమనార్హం.

హౌస్ లో చెత్త కంటెస్టెంట్ ఎవరనే ప్రశ్నకు జెస్సీ స్పందిస్తూ రాజ్ అని అన్నారు.రేవంత్, శ్రీహాన్, గీతూ రాయల్ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో గేమ్ అడుతున్నారని జెస్సీ చెప్పుకొచ్చారు.

అర్జున్ కళ్యాణ్ నసగాడని రేవంత్ దగ్గర డ్రామా చేస్తాడని జెస్సీ తెలిపారు.

Telugu Bigg Boss Show, Jessie-Movie

జెస్సీ చేసిన కామెంట్లపై ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.బిగ్ బాస్ షోలో పాల్గొనడం జెస్సీకి మైనస్ అయిందే తప్ప ప్లస్ కాలేదనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో తర్వాత సీజన్లు ఉంటాయా? లేదా? అనే చర్చ జరుగుతోంది.బిగ్ బాస్ షో టాస్క్ లు సైతం రొటీన్ గా ఉంటున్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube