హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్ -ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ పై సుప్రీంకోర్టు కమిటీ రివ్యూ చేసింది.ధర్మాసనం నియమించిన సూపర్ వైజర్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది.
మాజీ చీఫ్ జస్టిస్ కక్రూ, తెలంగాణ ఏసీబీ డీజీ అంజన్ కుమార్ మాజీ క్రికెటర్ వెంకటపతి రాజులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.దీనిలో భాగంగా మ్యాచ్ ప్రశాంతంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేయాలని కమిటీ తెలిపింది.
ఈనెల 26న ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలిస్తామన్నారు.అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడిస్తామని కమిటీ వెల్లడించారు.







