దసరా ర్యాలీ వివాదంపై ఎట్టకేలకు చిక్కుముడి వీడింది.బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటిషన్ పై ముంబై హైకోర్టు విచారణ జరిపింది.
ఈ క్రమంలో ఉద్దవ్ ఠాక్రేకు అనుకూలంగా తీర్పు వెలువడింది.శివాజీ పార్క్ మైదానంలో అక్టోబర్ 2 నుంచి 6 మధ్యన ర్యాలీ నిర్వహించేందుకు శివసేనకు అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
అయితే శాంతి భద్రతల నడుమ ర్యాలీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.







