గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.రాజాసింగ్ పై నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలు చేసిన ఆమె.
తాజాగా తన భర్తకు ప్రాణహాని ఉందంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు.తోటి ఖైదీల నుంచి ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు.
అయితే ఈ పిటిషన్ పై కోర్టు నిన్న విచారణ చేపట్టగా.వాదనలు వినిపించేందుకు సమయం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.దీంతో తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు.







