వైసీపీ నేత హత్యతో ఉద్రిక్తంగా మారిన సింగరాయకొండ..!

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నేత హత్య చేయబడటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.పాత కక్షల నేపథ్యంలో వైసీపీ నాయకుడు పసుపులేటి రవితేజను దండగలు లారీతో ఢీ కొట్టి హత్య చేయడం జరిగింది.

 Singaraikonda Became Tensed With The Murder Of Ycp Leader , Singaraikonda, Ycp-TeluguStop.com

ఈ హత్య సింగరాయకొండలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం సృష్టించింది.పరిస్థితి చాలా హింసాత్మకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఒంగోలు నుంచి అదనపు బలగాలను తెప్పించి సింగరాయకొండలో మోహరించారు.

ఇదే సమయంలో హత్యకు ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు.మరోపక్క హత్యకు నిరసన చేపడుతున్న ఆందోళనకారులలో కొందరు పోలీస్ స్టేషన్ గోడలు దూకి.

హత్యకు ఉపయోగించిన లారీకి నిప్పు పెట్టారు.అంతేకాకుండా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న చలివేంద్రాన్ని కూడా తగలబెట్టారు.

దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు.సింగరాయకొండలో దుకాణాలు మూసివేయించారు.

ఉన్నతాధికారుల రంగంలోకి దిగి భారీ బందోబస్తులను ఏర్పాటు చేస్తూ పరిస్థితులు హింసాత్మకంగా మారకుండా పర్యవేక్షిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube