మనిషన్నాక కూసింత కలా పోసన వుండాలి అని అప్పుడెప్పుడో రావు గోపాల్ రావు చెప్పిన విషయాన్ని ఇప్పటికీ కూడా ఎంతో మంది ఫాలో అవుతున్నారు.అయితే ఇలాంటి కళాపోషణ సినిమాలను తెరకెక్కించే దర్శకులలో కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి.
సాదా సీదా సినిమాలను తెరకెక్కించడంలో ఏమో గాని కామెడీ సినిమాలను తెరకెక్కించే దర్శకులు మాత్రం కళాపోషణ కాస్త ఎక్కువే కావాలి.ఎందుకంటే ఎంతో క్రియేటివిటీ ఉంటేనే తమ సినిమాలతో ప్రేక్షకులకు నవ్వించగలరు.
ఒకప్పుడు జంధ్యాల ఆ తర్వాత కాలంలో ఇవివి సత్యనారాయణ లాంటి డైరెక్టర్లు కామెడీ సినిమాలతో ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు.
ఇక ఆ తరువాత కాలంలో అదే రేంజ్ లో బ్రాండ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ శ్రీనువైట్ల.
ఇక శ్రీను వైట్ల తెరకెక్కించిన సినిమాలన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతూ ఉంటాయి.వెంకీ, దుబాయ్ శీను, ఢీ, దూకుడు ఇలా ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇండస్ట్రీ ఇచ్చారు.
ఇక ఇలా బ్లాక్ బస్టర్ తో దూసుకుపోతున్న శ్రీను వైట్ల దూకుడు తర్వాత మళ్లీ అలాంటి బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయాడు.పలు భిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
ఇక ఆయన సినిమాల్లో ఘోరంగా ఫ్లాప్ కావడానికి కారణం శ్రీను వైట్ల, కొన వెంకట్ మరియు గోపీమోహన్ తో విభేదాలు ఏర్పడటమే.

ఎందుకంటే శ్రీను వైట్ల మొదటి సినిమా నుంచి కూడా ఈ ముగ్గురూ కలిసే పని చేసేవారు.ఇక ముగ్గురు ప్రతిభావంతులు కావడంతో మంచి అవుట్ పుట్ కూడా వచ్చేవి.కానీ విభేదాలతో ఈ ముగ్గురు విడిపోయారు.
దీంతో శ్రీను వైట్ల హిట్లకు బ్రేక్ పడింది.అయితే ఇటీవలే హీరో గోపీచంద్ ద్వారా ఈ ముగ్గురు కలిశారు అనేది తెలుస్తుంది.
ఒక సినిమా కోసం శ్రీను వైట్ల గోపీ చంద్ కు కథ చెప్పాడట.అయితే సినిమాకు ఓకే చెప్పిన గోపీచంద్ ఒక కండిషన్ పెట్టాడట.
పాత టీం మొత్తం మళ్ళీ కలిసి చేస్తేనే సినిమా చేస్తాను లేదంటే చేయను అంటూ చెప్పేశాడట.ఇక ఆ తర్వాత కోన వెంకట్, గోపీమోహన్ కలిసి సినిమా కోసం పని చేద్దాం మరి స్పెషల్ రిక్వెస్ట్ చేశాటడ.
గోపీచంద్ ద్వారా విభేదాల కారణంగా విడిపోయిన ఈ ముగ్గురు మళ్లీ కలిసి పని చేయబోతున్నారు అని తెలుస్తోంది.







