టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ముత్యాలసుబ్బయ్య ఒకరు.సెంటిమెంట్ సుబ్బయ్య అనేది ప్రేక్షకులు పెట్టిన పేరు అని అయితే నేను సెంటిమెంట్ సినిమాలతో పాటు ఇతర సినిమాలు కూడా తీశానని ఆయన అన్నారు.
సెంటిమెంట్ కే పరిమితమై ఉంటే ఇప్పటివరకు 50 సినిమాలు తీసేవాడిని కాదని ఆయన పేర్కొన్నారు.నా తొలి సినిమా మూడుముళ్ల బంధం అని ఆ సినిమాకు ప్రశంసలు వచ్చినా కమర్షియల్ గా ఆ సినిమా సక్సెస్ సాధించలేదని ఆయన తెలిపారు.
మా సొంతూరు ప్రకాశం జిల్లాలోని బిట్రగుంట అని నేను కావలిలో డిగ్రీ చదువుతున్న సమయంలో వీధి నాటకాలు వేసేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.చెన్నై వెళ్లి కో డైరెక్టర్ గా జాయిన్ అయ్యి కొందరు నిర్మాతల ప్రోత్సాహంతో మొదటి సినిమా మొదలుపెట్టానని ఆయన తెలిపారు.
మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన హిట్లర్ సినిమా సూపర్ హిట్టైందని ఆ సినిమా రైట్స్ కొన్న ఎడిటర్ మోహన్ చిరంజీవితో సినిమా తెరకెక్కించే అవకాశాన్ని నాకు ఇచ్చారని ముత్యాల సుబ్బయ్య అన్నారు.

మామగారు సినిమా కూడా ఒక తమిళ సినిమాకు రీమేక్ అని ఆ సినిమాలోని పాత్రకు దాసరి కరెక్ట్ అని భావించి ఆయనను కాంటాక్ట్ కావడం జరిగిందని ముత్యాల సుబ్బయ్య తెలిపారు.చెన్నైకు దగ్గరగా ఉండే సిటీ తిరుపతి అని తిరుపతిలో నేను షూట్ చేసిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయని ఆయన తెలిపారు.జగపతిబాబు నటించిన ఒక చిన్నమాట సినిమా వల్ల ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని ఆయన అన్నారు.

చరణదాసి అనే పాత సినిమా ప్రేరణతో ఆ సినిమా తెరకెక్కిందని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.షూటింగ్ మొదలైనప్పటి నుంచి అన్నీ మార్పులేనని ఆయన తెలిపారు.సౌందర్య హీరోయిన్ గా అనుకుంటే ఇంద్రజను ఎంపిక చేశారని కథను ఒక కోణంలో సిద్ధం చేస్తే మరో కోణంలో మార్చేశారని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పానని అనుకున్న విధంగానే ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు.
ఆ సినిమా వల్ల ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.







