మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాథర్ ఒకటి.ఆచార్య ప్లాప్ తర్వాత ఈ సినిమాతో మెగాస్టార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాపై అందుకే మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.అదే సమయంలో కాస్త భయంగా కూడా ఉన్నారు.
ఎందుకంటే ఆచార్య సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.
ఇక ఇప్పుడు రాబోతున్న గాడ్ ఫాదర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
మరొక రెండు వారాల్లో ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.అయినా కానీ మొన్నటి వరకు ప్రొమోషన్స్ స్టార్ట్ చేయలేదు.కానీ అనూహ్యంగా చిన్న డైలాగ్ తో మెగాస్టార్ ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేసారు.
ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లో భారీ బిజినెస్ చేసినట్టు టాక్ వస్తుంది.
ఆచార్య ప్లాప్ అయినా కూడా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో సెన్సేషన్ ఫిగర్ కి బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.

గాడ్ ఫాదర్ తెలుగు మరియు హిందీ కలిపి 2 మిలియన్ మేర టార్గెట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.మరి ఆచార్య ఎఫెక్ట్ ఉన్న ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం గ్రేట్ అనే చెప్పాలి.
ఇక తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుంటే.సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు.థమన్ సంగీతం అందించాడు.







