భీమ్లా నాయక్ ను ఆస్కార్ కు పంపలేదా? ఏ ఆఫీషియల్ రీమేక్ అని నా?

సాధారణంగా సినిమా పరిశ్రమలో నటీనటుల సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారికి ఎన్నో అవార్డులను అందజేస్తారనే విషయం మనకు తెలిసిందే.ఇలా చిత్ర పరిశ్రమలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ అవార్డు ఒకటి.

 Pawan Kalyan Bheemla Nayak Not In Oscar Nominations Isnt It Official Remake Deta-TeluguStop.com

ఇలా ఆస్కార్ అవార్డు గెలుచుకుంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు.ఇకపోతే ఈ ఏడాది ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ఆస్కార్ బరిలో ఉండబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ విధంగా రాజమౌళి సినిమా మూడు విభాగాలలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిందని అలాగే హీరోలు కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఆస్కార్ అఫీషియల్ గా అవార్డు బరిలో ఉన్నటువంటి లిస్టు విడుదల చేయగా ఇండియా నుంచి గుజరాతీ అనఫిషియల్ ఫిలిం ఛల్లో షో అనే సినిమా నామినేట్ అయినట్లు ప్రకటించడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్ రేసులో లేకపోవడం ఏంటి అంటూ అందరూ పెదవి విరిచారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నేటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.అనఫీషియల్ రీమేక్ సినిమా ఆస్కార్ రేసులో ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా కూడా రీమేక్ చిత్రమే అయినా ఈ చిత్రం ఎందుకు ఆస్కార్ రేసులో లేదు అంటూ పలువురు నెటిజన్ లు కామెంట్ చేస్తున్నారు.

ఈ సినిమాని అఫీషియల్ రీమేక్ చిత్రంగా ప్రకటించారు అలాగే పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది.ఇలా హిట్ అయిన సినిమాని ఎందుకు ఆస్కార్ అవార్డు నామినేషన్లకు పంపించలేదు అంటూ పలువురు నెటిజన్లు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.మొత్తానికి ఈసారి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా RRR సినిమాకు తప్పకుండా ఒక అవార్డు అయినా వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయిందని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube