ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై సీపీఐ రామకృష్ణ విమర్శలు..!!

ఏపీ అసెంబ్లీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుకు వైసీపీ బిల్లు పెట్టి ఆమోదం పొందుకున్న సంగతి తెలిసిందే.ఒకసారిగా జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల టీడీపీ నేతల నుండి పలు రాజకీయ పార్టీల నుండి విమర్శలు వస్తూ ఉన్నాయి.

 Cpi Ramakrishna Serious Comments On Cm Jagan,  Cpi Ramakrishna, Cm Jagancpi Rama-TeluguStop.com

తాజాగా ఈ దిశగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం పట్ల సీరియస్ అయ్యారు.

1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలి అనుకోవడం తుగ్లక్ చర్య అని అన్నారు.కావాలని పదేపదే పలు అంశాలను వివాదాస్పదం చేయటం జగన్ కి అలవాటైపోయిందని విమర్శించారు.

కక్షపూరిత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క యూనివర్సిటీని కూడా స్థాపించింది లేదని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది భర్తీ ఇంకా సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube