గాజువాక కండక్టర్ ఝాన్సీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.ఈమె ఒక సాధారణ బస్ కండక్టర్ గా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ మరోవైపు తనకి ఎంతో ఇష్టమైన డాన్స్ పై శ్రద్ధ పెట్టారు.
ఇలా తన భర్త ప్రోత్సాహంతో తను చేసినటువంటి అద్భుతమైన డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమె టాలెంట్ గుర్తించిన మల్లెమాలవారు తనని శ్రీదేవి డ్రామా కంపెనీ వేదిక పైకి తీసుకువచ్చారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఝాన్సీ ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీగా ఎంతో బిజీగా ఉన్నారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పల్సర్ బండి అనే పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మొదటి పాటతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈమెకు వరుస కార్యక్రమాలలో అవకాశాలు రావడమే కాకుండా ఏకంగా సంపూర్ణేష్ బాబు సినిమాలో ఒక పాటకు డాన్స్ చేసే అవకాశం కూడా అందుకున్నారు.
ఇలా ఎంతో బిజీగా కడుపుతున్న ఈమె మొదటి సారి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేసింది అనుకుంటే పొరపాటు.చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈమె 11 సంవత్సరాల క్రితమే జీ తెలుగులో ప్రసారమైన తీన్మార్ అనే డాన్స్ షోలో పార్టిసిపేట్ చేశారు.

ఈ కార్యక్రమానికి అప్పట్లో ఉదయభాను యాంకర్ గా వ్యవహరించేది.ఇలా ఈ వేదికపై డాన్స్ చేయడం కోసం ఉదయభాను సాదరంగా తనని వేదికపైకి ఆహ్వానించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇలా 11 సంవత్సరాల క్రితమే బుల్లితెరపై సందడి చేస్తున్న ఝాన్సీకి అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం వల్ల పెద్దగా గుర్తింపు రాలేదు అయితే ప్రస్తుతం ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదాలో కొనసాగుతున్నారు.







