బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమౌతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.అయితే ఏదైనా పండుగలు ప్రత్యేక రోజులలో బుల్లితెర కార్యక్రమాలలో ప్రత్యేక ఈవెంట్లను ప్లాన్ చేయడంలో మల్లెమాలవారు ముందు వరుసలో ఉంటారు.
ఈ క్రమంలోనే త్వరలోనే దేవి నవరాత్రుల ప్రారంభమవుతున్న నేపథ్యంలో మల్లెమాలవారు నవరాత్రి ధమాకా అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర నటీనటులు జబర్దస్త్ కమెడియన్స్, పలువురు సినీ నటులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.ఈ కార్యక్రమానికి సీనియర్ నటిమనులు ప్రేమ సంఘవి వంటి హీరోయిన్స్ హాజరయ్యారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా రచ్చ రవి తిరిగి చాలా కాలానికి ఈటీవీ వేదికపై సందడి చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే హైపర్ ఆది రచ్చ రవిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.
ఈ సందర్భంగా ఓ స్కిట్ లో భాగంగా రచ్చ రవి మాట్లాడుతూ నాతో ఎవరైనా మాట్లాడాలంటే ఐదు అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలి అంటూ చెప్పగా వెంటనే హైపర్ ఆది స్పందిస్తూ… ఇలాంటివి చెప్పినందుకే ఐదేళ్లు దూరంగా ఉన్నావంటూ రచ్చ రవి పై పంచ్ వేశాడు.

ఇకపోతే అనంతరం బుల్లితెర నటితో కలిసి ఒక స్కిట్ చేసినట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది.ఈ క్రమంలోనే రచ్చ రవి ఏమే ఈరోజు రాత్రి మొత్తం శివుడికి సేవ చేస్తూ తెల్లవార్లు జాగరణ చేయాలి అంటూ చెబుతాడు.ఇదే సమయంలోనే హైపర్ ఆది కల్పించుకొని శివరాత్రికి నవరాత్రికి కూడా తేడా తెలియదు ఎవడ్రా వీన్ని తీసుకు వచ్చింది అంటూ మరోసారి తన పరువు మొత్తం తీశాడు.
మొత్తానికి నవరాత్రి ధమాకా కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడానికి మల్లెమాల వారి సిద్ధమైనట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.







