నట్టింట్లో భారీ తేనెతుట్ట.. ఎవరినీ కుట్టడం లేదని ఏం చేశారంటే

ఎంతో తీయగా ఉండే తేనె అంటే ఇష్టపడని వారు ఉండరు.సహజసిద్ధంగా లభించే తేనెలో ఎన్నో ప్రయోజనాలున్నాయి.

 A Huge Bee In The Nhose What Did They Do Not To Sting Anyone? Honey Bees,viral-TeluguStop.com

పుట్ట తేనె, చెట్టు తేనె ఇలా వైవిధ్య రకాలైన తేనెలున్నా, అది కనిపించగానే కాస్త అయినా రుచి చూడాలని అనిపిస్తుంది.అయితే అలాంటి తేనెను అంతా ఇష్టపడినా తేనె తుట్టను చూడగానే భయపడతారు.

ఒక్క ఈగ వచ్చి కుట్టినా విలవిలలాడిపోతారు.అందుకే తేనె తుట్ట ఉన్న చోటికి వెళ్లకుండా జాగ్రత్త పడతారు.

ముఖ్యంగా పెద్ద పెద్ద తేనె తుట్టల వద్ద ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఆ తేనెటీగలన్నీ మూకుమ్మడిగా దాడి చేసే అవకాశం ఉంది.అయితే తేనె తుట్టలన్నీ పొలాల్లోనే, చెట్లంటా పుట్లంటా కనిపిస్తాయి.

ఇళ్ల వద్ద చాలా అరుదుగా ఏర్పడతాయి.ఆశ్చర్యకరంగా ఓ కుటుంబం తమ ఇంట్లో తేనె తుట్టను పెంచుకుంటున్నాయి.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇంటి సమీపంలో తేనె తుట్ట ఉంటే వీలైనన్ని రోజుల్లోనే దానిని తీసేస్తారు.

ఎందుకంటే ఏ ఒక్క తేనెటీగ కుట్టినా తట్టుకోడం మన వల్ల కాదు.ముఖ్యంగా భారీ తేనెతుట్ట ఉంటే, ఆ తేనెటీగలన్నీ ఒక్కసారిగా దాడి చేస్తే ఖచ్చితంగా ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

అయితే తెలంగాణలోని ములుగు జిల్లా రాజపేట గ్రామంలో సూరిబాబు అనే వ్యక్తి ఉన్నాడు.అతడి ఇంటి వరండాలో ఏ పెద్ద తేనె తుట్ట ఉంది.

Telugu Honey Bees, Latest-Latest News - Telugu

దానిని చూసిన వారంతా అవాక్కవుతున్నారు.దాదాపు 8 నెలల క్రితం తేనె తుట్ట ఉంటుంది.మొదట్లో చిన్న తేనె తుట్టగా మొదలైన అది క్రమంగా మూడున్నర అడుగుల కంటే ఎత్తుగా పెరిగింది.ఉండే కొద్దీ అది పెరుగుతూ వస్తోంది.

తేనెటీగలు కూడా భారీగా పెరగసాగాయి.ఎవరైనా అకస్మాత్తుగా వారి ఇంటికి వచ్చి చూసి మొదట్లో ఆందోళన చెందుతున్నారు.

అయితే 8 నెలలుగా ఆ తేనె తుట్ట ఉందని, ఒక్క తేనెటీగ కూడా తమను కుట్టలేదని వారు చెబుతున్నారు.అందుకే దానిని తొలగించలేదని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇది చర్చనీయాంశంగా మారింది.చాలా మంది చుట్టు పక్కల వాళ్లు చూసి వెళ్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube