లారీల వెనుక భాగంలో 'Horn Ok Please' అని ఎందుకు రాస్తారో తెలుసా?

‘Horn Ok Please’… ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు ఎప్పుడు ఒకప్పుడు లారీలు, ఇతర వాహనాల వెనుక వైపు చూసే వుంటారు.మీలో చాలా మంది ఇలాంటివి చూసినా పెద్దగా పట్టించుకోరు.

 లారీల వెనుక భాగంలో ‘horn Ok Please’-TeluguStop.com

వాహనాలకు ఏదైనా రాశారంటే దాని వెనుక అర్థం ఖచ్చితంగా దాగి ఉంటుంది.ఇలా రాయడం వెనుక కూడా అర్థం దాగి వుంది.

హార్న్‌ ఓకే ప్లీజ్‌ అనే పదాలు చూసిన వాహనదారులు అనవసరమైన హారన్‌ ఉపయోగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారనిక సెక్షన్‌ 134 (1) వాహన చట్టం కింద 2015 ఏప్రిల్‌ 30న మహారాష్ట్ర సర్కార్‌ వాహనాలపై ‘Horn Ok Please’ అనే పదాలను బ్యాన్‌ చేసింది.

బేసిగ్గా ట్రక్‌ రోడ్డుపై వెళ్తున్నప్పుడు దానిని ఎవరైనా ఓవర్‌ టెక్‌ చేయాలి అనుకుంటే ముందుగా హారన్‌ కొడతారు.

దీంతో ముందు వాహనం నడిపే ట్రక్‌ డ్రైవర్‌ తన వెనుక మరో భారీ వాహనం వస్తోందని గమనించి వాళ్లు ఓవర్‌టెక్‌ చేయ్యాలనే ఉద్దేశంతో హారన్‌ కొట్టారని అర్థం చేసుకుంటారు.వెనుక వాహనానికి ముందున్న వాహన డ్రైవర్‌ దారి ఇస్తాడు.

దీంతో వెనుకున్న వాహనదారుడు ఓవర్‌ టెక్‌ చేసి ముందుకెళ్తాడు.అయితే వాహనాల వెనుక ఓకే (OK) పదాన్ని సరదా కోసం రాస్తారేమో అనుకుంటారు.

కానీ దీని వెనుక కూడా అర్థం ఉందని వాహనదారులు చెబుతుంటారు.

Telugu Horn, Latest, Lorry, Vehicle, Vehicles-General-Telugu

ఈ OK అనేది హార్న్‌ కొట్టు పర్వాలేదు అనే అర్థం వచ్చేలా ఈ OK అర్థం ఉందని భావిస్తుంటారు.కొన్ని ప్రాంతాల్లో సింగిల్‌ రోడ్డు ఉండటం వల్ల ఇబ్బందులు ఉంటాయి.ఇలాంటి రోడ్లలో చిన్న వాహనాలు మాత్రమే నడుస్తుంటాయి.

కానీ కొన్ని సమయాల్లో ముందున్న పెద్ద వాహనం లాంటి లారీ ఉంటే ఓవర్‌ టెక్‌ చేయడానికి వీలుండదు.రోడ్డులో ఎదురుగా ఏ వాహనం వస్తుందో తెలిసేది కాదు.

పెద్ద వాహనాన్ని దాటేందుకు వెనుకున్న వాహనదారులు హారన్‌ కొట్టగానే ముందున్న వాహనంలోని డ్రైవర్‌ OK అని అర్థం వచ్చేలా ఓ వైట్‌ కలర్‌ బల్బును వెలిగించేవారు.ఆ బల్బు వెలిగితే ఓవర్‌ టెక్‌ చేసుకోవచ్చని అర్థం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube