ఆస్కార్ రాకపోయినా ఆర్ఆర్ఆర్ పై గౌరవం తగ్గదుగా.. ఆ మూవీ చెత్త అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ బరిలో నిలుస్తుందని అందరూ భావించారు.అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ రేసులో నిలవలేదు.

 Rrr Movie Real Range Details Here Goes Viral In Social Media, Junior Ntr ,charan-TeluguStop.com

అయితే ఆస్కార్ వచ్చినా రాకపోయినా ఈ సినిమాపై గౌరవం ఏ మాత్రం తగ్గదంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల మెప్పు పొందిందని రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ బరిలోకి పంపకపోవడం కంటే ఛెల్లో షో అనే ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపు లేని సినిమాను ఆస్కార్ కు ఎంపిక చేయడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఈ సినిమా రీమేక్ సినిమా అని చాలా సంవత్సరాల క్రితం విడుదలైన ఒక హాలీవుడ్ మూవీకి ఈ సినిమా అనుకరణలా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

చెల్లా షో చిత్రయూనిట్ ఈ కామెంట్ల గురించి రాబోయే రోజుల్లో స్పందిస్తుందేమో చూడాల్సి ఉంది.రాజమౌళి సినిమాలకు ఇప్పుడు కాకపోయినా ఆలస్యంగానైనా గుర్తింపు దక్కడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు సినిమాకు ఆస్కార్ రావాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటుండగా రాబోయే రోజుల్లో అయినా తెలుగు సినిమాకు ఆ గుర్తింపు దక్కుతుందేమో చూడాల్సి ఉంది.

Telugu Charan, Ntr, Range, Rrr-Movie

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపికై ఉంటే భవిష్యత్తులో భారీ బడ్జెట్ సినిమాల దిశగా మరిన్ని అడుగులు పడే అవకాశం ఉండేదని చెప్పవచ్చు.చెల్లో షో మూవీని ఆస్కార్ పంపడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఛెల్లో షో మూవీ మాత్రం చెత్త మూవీ అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపిక కాకపోవడంతో చరణ్, తారక్ ఫీలవుతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube