బిగ్ బాస్ హౌస్ లో గొడవలు, తిట్టుకోవడం, ఏడ్చడాలు, వీటితో పాటుగా లవ్ ఎఫైర్లు అన్నవి కూడా జరుగుతూ ఉంటాయి.కాగా ప్రతి సీజన్లో కూడా ఎవరో ఒకరి మధ్య ఈ లవ్ ఎఫైర్ గురించి వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ మధ్య ఏదో జరుగుతుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.మరోవైపు ఆరోహి, ఆర్జె సూర్యల మధ్య కూడా సంథింగ్ సంథింగ్ జరుగుతోంది.
వారి మధ్య లవ్ నడుస్తుంది అంటూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అభినయశ్రీ మ్యాటర్ ను లీక్ చేసిన విషయం తెలిసిందే.
కాని ఆరోహి-ఆర్జే సూర్యలు మాత్రం జస్ట్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అని అంటున్నారు.
అయితే ఆరోహి తెగ ఏడుస్తుంటే ఓదార్చే ప్రయత్నంలో భాగంగా టైట్ హగ్‌లు ఇచ్చాడు.ఆర్జే సూర్య.ఆ తరువాత అమ్మాయి గారు అలకలో ఉంటే సారీ చెప్పమన్నందుకు గానూ మనోడు ముద్దులిస్తున్నట్టుగా సౌండ్‌లు చేశాడు.ఇదిలా ఉంటే.
అసలు ఆర్జే సూర్య-ఆరోహిల మధ్య జరుగుతున్నది ఏంటి? వాళ్లిద్దరూ ముద్దులు పెట్టుకున్నారా? హౌస్‌లో ఎలా ఉండేవారన్న దానిపై అసలు వాస్తవాలను బహిర్గతం చేశాడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షానీ సాల్మన్.

తాజాగా ఇంటర్వ్యూలో ఓ యాంకర్ అత్యుత్సాహం చూపిస్తూ.బిగ్ బాస్ హౌస్‌లో ఆ ముద్దులేంటి? హగ్ లేంటి? ఆ ఎక్స్ పోజింగ్ ఏంటి? ఆర్జే సూర్య-ఆరోహిల ముద్దు పెట్టుకున్నారు కదా.నేను చూశానంటూ అంటూ ప్రశ్నించగా.వెంటనే ఆ విషయాలపై రియాక్ట్ అయిన షానీ ఆరోహి,ఆర్జే సూర్యలు ముద్దులు పెట్టుకున్నారని అంటున్నారు.వాళ్లు ముద్దు పెట్టుకోవడం అయితే నేను చూడలేదు.ఒక వేళ పెట్టుకున్నా వాళ్లు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో చూడాలి అని చెప్పుకొచ్చాడు షాని.అలాగే బిగ్ బాస్ హౌస్ ని బ్రోతల్ హౌస్ అంటూ సిపిఐ నారాయణ మాట్లాడిన మాటలను కూడా ఖండించాడు షాని.







