షాకింగ్ బ్యూటీ సీక్రెట్స్ రివీల్ చేసిన నటి.. అందం కోసం ఈ చిన్న పనులు చేస్తే చాలట?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్లు చూడడానికి ఎంతో అందంగా నేచురల్ లుక్ తో కనిపిస్తూ ఉంటారు.ముఖంపై ఎటువంటి పింపుల్స్ లేకుండా, మేకప్ లేకపోయినా కూడా అందంగా కనిపిస్తూ ఉంటారు.

 Beauty Tips Tara Sutaria Reveals About Her Beauty Secret, Beauty Tips, Tara Suta-TeluguStop.com

ఇంకొందరు హీరోయిన్లు ముఖంపై పింపుల్స్ ని మేకప్ తో కవర్ చేస్తూ ఉంటారు.అయితే హీరోయిన్స్ అంతా అందంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు.

అటువంటి వారి కోసం తాజాగా బ్యూటీ టిప్స్ చెప్పుకొచ్చింది హీరోయిన్ తారా సుతారియా.స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 సినిమాతో బాలీవుడ్‌ కీ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

మొదటి సినిమాతోనే తన అందం,నటనతో యువతని ఆకట్టుకుంది.మరీ ముఖ్యంగా ఈమె అందానికి ఈ విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.అరంగేట్రం లోనే తన అందంతో యువతను ఫిదా చేసింది తారా సుతారియా.ఇది కాకుండా నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

ఇక మర్జావన్‌, తడప్‌, ఏక్‌ విలన్‌ రిటర్న్స్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువ అయ్యింది.ఇది ఇలా ఉంటే ఈమె అందం రహస్యం గురించి తెలుసుకోవాలని అభిమానులు కుతూహలంగా ఉంటారు.

అయితే తాజాగా తన అందం యొక్క రహస్యాలను చెప్పుకొచ్చింది తారా సుతారియా.

Telugu Tips, Honey, Tara Sutaria, Tarasutaria, Turmeric-Movie

తన మెరిసే మేనికి అమ్మ చెప్పిన చిట్కాలే కారణం అంటోంది.ముఖం చంద్రబింబంలా మెరవాలంటే తాను చెప్పే టిప్స్ ని ఫాలో అయితే సరిపోతుంది అని అంటుంది ఈ బ్యూటీ.నా బ్యూటీ సీక్రెట్ మంచినీళ్లు.

అలాగే అమ్మ నేర్పిన హోం మేడ్ ఫేస్ ప్యాక్.పెరుగులో, తేనె శనగపిండి,కాస్త పసుపు కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసి అది డ్రై అయిన తర్వాత చన్నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి.

ఈ విధంగా చేయడం వల్ల మొహంలోని అలసట మాయమైపోయి ముఖంలో గ్లో వచ్చేస్తుంది అని చెప్పుకొచ్చింది తారా సుతారియా.అయితే ఈ హోం మేడ్ చిట్కా మా అమ్మమ్మది.

ఆమె ఫాలో అయ్యింది.ఇప్పుడు నేను ఫాలో అవుతున్నాను.

నా అందం వెనుక ఉన్న రహస్యం ఇదే అని తెలిపింది తారా సుతారియా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube