కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు.చెన్నైకి చెందిన ముస్లిం దంపతులు సుబీనా బాను, అబ్దుల్ ఘనీలు శ్రీవారి ఆలయానికి రూ.1.02 కోట్లు విరాళంగా ఇచ్చారు.తిరుమలకు వచ్చిన ఈ దంపతులు విరాళం చెక్కును ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈవో ధర్మారెడ్డికి అందించారు.ఈ మొత్తం విరాళంలో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల ఆధునీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనానికి రూ.87 లక్షలు అందజేశారు.







