హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది.ఈ నెల 25న జరగనున్న భారత్ -ఆసీస్ టీ20 మ్యాచ్ టికట్ల విక్రయాలలో భారీగా అవకతవకలు జరిగాయని హైకోర్టు న్యాయవాది హెచ్ఆర్సీని ఆశ్రయించారు.
హెచ్‌సీఏ బ్లాక్ లో మ్యాచ్ టికెట్లను విక్రయిస్తోందని ఆయన ఆరోపించారు.ఫిర్యాదును స్వీకరించిన మానవ హక్కుల కమిషన్.
ఈ వ్యవహారంపై విచారణ చేయనుంది.మరోవైపు, హెచ్‌సీఏపై క్రికెట్ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతవరకు ఆఫ్ లైన్ టికెట్లు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకున్న కొందరికి డబ్బులు తిరిగి వచ్చాయని చెబుతున్నారు.
ఈ క్రమంలో హెచ్‌సీఏపై చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.







