భారతదేశంలో పలు ప్రాంతాలలో రకరకాల ఆచార వ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి.ఇక్కడ అంచెలంచెలుగా కొత్త సంస్కృతి, కొత్త భాషలు, ఆహారపు అలవాట్లు అనేవి కనబడుతూ ఉంటాయి.
ఇక మన పక్కవాడినే నమ్మలేని ఈ కాలంలో మనదేశంలో కేవలం నమ్మకంతో మాత్రమే నడుస్తున్న దుకాణాలు వున్నాయి.కాగా అక్కడి షాపుల్లో దుకాణదారులు అనేవారు ఎవరూ వుండరు.
ఇక పనివాళ్ళు కూడా వుండరు.తాజాగా ఈ షాపులపై IAS అవనీష్ శరణ్ ట్వీట్ చేశారు.
ఆ దుకాణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర భారతదేశంలో ఉన్న మిజోరం రాష్ట్రంలో హైవేపై కూరగాయలు, పండ్ల దుకాణాలు అనేకం కనబడుతూ ఉంటాయి.
ఈ షాపుల్లో దుకాణదారుడు ఉండరు.ఇక్కడ ఒక స్తంభంపై ధర మాత్రమే వ్రాసిన చిన్న బోర్డు వేలాడదీయబడి ఉంటుంది.అలాగే డబ్బు పెట్టడానికి ఒక పెట్టె అక్కడ ఉంటుంది.సెయిలింగ్ మిజోరాం రాజధాని ఐజ్వాల్ నుండి 200 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో కనిపించింది ఈ దృశ్యం.ఈ దుకాణాలు తరచుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంటాయి.
ఇప్పటి వరకు ఈ షాపుల్లో దొంగతనం జరగలేదని తెలిస్తే మీరు నమ్మాలి.

ఈ సంస్కృతిని మిజోరంలో ‘న్ఘహ్-లౌ-డావర్’ అని పిలుస్తారు.ఈ దుకాణాలను కరోనా కాలంలో ప్రారంభించారు.హైవే పక్కన నిర్మించిన ఈ దుకాణాలలో కూరగాయలు, పండ్లు, చేపలు కాకుండా ఇంకా అనేక రకాల ఆహారపదార్ధాలను విక్రయిస్తున్నారు.
సరుకులు కొనాలనుకున్నవారు వాటికి సరిపడా డబ్బును షాపులో ఉంచిన బ్యాగులో వేసుకుని, అక్కడి నుంచి వస్తువులను తీసుకెళ్లేవారు.దుకాణదారులు షాపుల వద్ద కూర్చోవడం ప్రారంభిస్తే వ్యవసాయం చేయడానికి సమయం వుండటంలేదని ఈ ఐడియా వేసారట.
బాగుంది కదూ.







