టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లో అడుగుపెట్టి నేటికి సరిగ్గా పదిహేనేళ్లు కావస్తోంది.ICC T20 వరల్డ్‌కప్ 2007లో భాగంగా పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు మన రోహిత్ శర్మ.
ఇప్పటిదాకా 136 అంతర్జాతీయ మ్యాచ్‌లు విజయవంతంగా ఆడి, 3620 పరుగులు దాకా ఛేదించాడు.ఇందులో 4 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.
ఇక T20 ఫార్మాట్‌లో రోహిత్ అత్యధిక స్కోరు 118.ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రోహిత్ శర్మకు ఉన్న రికార్డు గురించి అందరికీ తెలిసినదే.
ముంబై ఇండియన్స్ సారథిగా జట్టును ఏకంగా 5 సార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ సొంతం.క్యాష్ రిచ్ లీగ్‌లో 227 మ్యాచ్‌లలో భాగమైన రోహిత్ 5879 పరుగులు సాధించాడు.
ఇందులో ఓ శతకం, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇక IPLలో అతడి అత్యధిక స్కోరు 109.పదిహేనేళ్ల క్రితం ICC మెగా ఈవెంట్‌తో తన T20 ప్రయాణం మొదలుపెట్టిన రోహిత్ శర్మ.పొట్టి ఫార్మాట్‌లో తన విజయ దుందుభి కొనసాగిస్తున్నాడు.ఇప్పటికే టీమిండియా సారథిగా పలు T20 సిరీస్‌లు గెలిచి ప్రపంచ రికార్డులు నెలక్పొలిన ఈ హిట్‌మ్యాన్.ప్రపంచకప్-2022లో తొలిసారిగా టీమిండియా టీ20 కెప్టెన్ హోదాలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఇకపోతే రోహిత్ తర్వాత టీమిండియా తరఫున T20లలో అరంగేట్రం చేసిన 10 మంది భారత ఆటగాళ్లు.రోహిత్ కంటే ముందే రిటైర్ కావడం విశేషం.ఇందులో ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్. రోహిత్ శర్మ T20లలో ఎంట్రీ ఇచ్చిన కొన్నిరోజులకే భారత్ తరఫున అరంగేట్రం చేశాడు.ICC T20 వరల్డ్‌కప్-2007 ఫైనల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భాగంగా తొలిసారి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.అలాగే మురళీ కార్తిక్ 2007లో ఆస్ట్రేలియాతో సిరీస్‌తో పొట్టి ఫార్మాట్‌లో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు.
ఇక IPL-2014లో భాగంగా తన చివరి T20 ఆడిన మురళీ కార్తిక్ ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగుతున్న విషయం విదితమే.







