నందమూరి బాలయ్య కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.ఆయన సినిమా వస్తుంది అంటే అప్పట్లో నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.
మాస్ ప్రేక్షకులు సైతం ఎదురు చూసే వారు.ఎందుకంటే ఈయన సినిమాల్లో మాస్ కంటెంట్ ఏ లెవల్లో ఉంటుందో ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు.
మరి అలాంటి బాలయ్య సినిమాల్లో వివి వినాయక్ డైరెక్ట్ చేసిన చెన్నకేశవ రెడ్డి సినిమా ఒకటి.ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బాలయ్య సినిమాల్లో కల్ట్ క్లాసికల్ గా మిగిలి పోయింది.
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తుండి పోయాయి.మరి అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా రీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు బాలయ్య వంతు రావడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఆ తరుణం కోసం ఈగర్ గా వైట్ చేస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ సినిమాను యూఎస్ లో 30 కి పైగానే స్పెషల్ షోలు వేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

దీంతో ఈ సినిమా గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా చర్చిస్తున్నారు.ఈ స్పెషల్ షో సెప్టెంబర్ 24, 25 న ఉండబోతున్నాయట.ఇక యుఎస్ లోనే కాకుండా ఇక్కడ కూడా ఈ సినిమా స్పెషల్ షోలు భారీ లేవల్లోనే ఉండనున్నాయని తెలుస్తుంది.
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.ప్రెజెంట్ ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నాడు.
ఆ తర్వాత అనిల్ రావిపూడితో 108వ సినిమాకు ఓకే చెప్పాడు.







