త్వ‌ర‌లోనే గిరిజ‌నుల‌కు గిరిజ‌న బంధు, 10శాతం రిజ‌ర్వేష‌న్లు..ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

కెసిఆర్ మాట త‌ప్ప‌డు… మ‌డ‌మ తిప్ప‌డు కెసిఆర్ లాంటి సిఎంను మ‌నం చూడ‌లేదుకెసిఆర్‌కి, టిఆర్ఎస్ కి గిర‌జ‌నులంతా అండ‌గా ఉండాలి గిరిజ‌నుల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లు, గిరిజ‌న బంధు ప్ర‌క‌ట‌న ప‌ట్ల మంత్రి ఎర్ర‌బెల్లికి కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డానికి హైద‌రాబాద్ కు త‌ర‌లి వ‌చ్చిన పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ గిరిజ‌న నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు సిఎం కెసిఆర్ అంద‌రి బంధువు… సబ్బండ వ‌ర్గాల‌కు సాయంగా ఉన్నారు.అన్ని కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు, ప్ర‌జ‌లు, ప్రాంతాల‌కు అతీతంగా అంద‌రి కోసం సిఎం ప‌ని చేస్తున్నారు.

 Tribals Will Soon Be Tribals, 10 Percent Reservations Errabelli Dayakar Rao Erra-TeluguStop.com

సిఎం కెసిఆర్ గారు చెప్పిన‌ట్లు త్వ‌ర‌లోనే గిరిజ‌నుల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లు, గిరిజ‌న బంధు ప‌థ‌కం అమ‌లు అవుతుంది.సిఎం కెసిఆర్ మాట త‌ప్ప‌రు.

మ‌డ‌మ తిప్ప‌రు.ఆయ‌న మాట అంటే మాటే.

క‌చ్చితంగా చేస్తారు.ఆయ‌న‌కు మ‌నం అండ‌గా ఉండాలి.

ఆయ‌న లాంటి సిఎం మ‌న‌కు దొర‌క‌రు అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.సిఎం కెసిఆర్ ఇటీవ‌ల చేసిన‌, గిరిజ‌నుల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లు, గిరిజ‌న బంధు ప్ర‌క‌ట‌న ప‌ట్ల మంత్రి ఎర్ర‌బెల్లికి కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డానికి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుండి హైద‌రాబాద్ కు త‌ర‌లి వ‌చ్చిన గిరిజ‌న నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఎంపీపీలు జెడ్పీటీసీలు, స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయ‌కులు,గ్రామ పార్టీ అధ్య‌క్షులు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుగారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డానికి వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా వారంద‌రినీ ఉద్దేశించి మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడారు.

గిరిజ‌నుల‌కు 10శాతం రిజర్వేష‌న్ల కోసం ఆరేండ్ల కిందనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం ఆ బిల్లుని క‌నీసం ప‌ట్టించుకోలేద‌న్నారు.

కొద్ది రోజుల క్రితం ఆ బిల్లే త‌మ వ‌ద్ద‌కు రాలేద‌ని బుకాయించార‌ని, చివ‌ర‌కు వ‌చ్చింద‌ని చెప్పార‌ని, ఈ ప‌రిస్థితుల్లో కేంద్రం ఉంటే ఎలా? అని మంత్రి చెప్పారు.అయితే, ఇటీవ‌ల గిరిజ‌న‌, ఆదివాసీ ఆత్మ‌గౌర‌వ సంత్ సేవాలాల్‌, కుమ‌రం భీం భ‌వ‌నాల‌ను హైద‌రాబాద్ లో ప్రారంభించిన స‌మ‌యంలో సిఎం గారు, కేంద్రానికి గ‌ట్టిగా చెప్పార‌ని, కేంద్రం కాద‌న్నా, మన రాష్ట్రంలో గిరిజ‌నుల కోసం 10శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు.

అలాగే ద‌ళిత బంధు లాగే, గిరిజన బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని చెప్పిన సిఎం కెసిఆర్ గారికి మ‌న‌మంతా కృత‌జ్ఞ‌త‌తో, అండ‌గా ఉండాల‌ని చెప్పారు.దేశంలో ఇలాంటి సిఎంలు లేర‌ని, ప్ర‌జ‌లంద‌రి కోసం ఆలోచిస్తున్న సీఎం గారికి మ‌న‌మంతా కృత‌జ్థ‌లు ధ‌న్య‌వాదాలు తెలపాల‌న్నారు.

సంద‌ర్భాలు వ‌చ్చిన‌ప్ప‌డు మ‌నమంతా అండ‌గా నిల‌వాల‌ని గిరిజ‌న ప్ర‌తినిధులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు విజ్ఞ‌ప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube