చైనాను అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.తైవాన్‌పై దాడి చేస్తే అమెరికా రంగంలోకి దిగడం తథ్యమని చెప్పారు.
పూర్తి స్థాయిలో తైవాన్‌కు సైనిక రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.తైవాన్ విషయంతో తమ వైఖరి మారదని స్పష్టం చేశారు.
అయితే, తైవాన్ కేంద్ర బిందువుగా అమెరికా, చైనా మధ్య వైరం ముదురుతున్న విషయం తెలిసిందే.భద్రతా పరమైన భరోసా అందించేందుకు తిరుగులేని దృక్పథాన్ని అవలంభిస్తోన్న బైడెన్ ను తైవాన్ విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది.







