త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన పేరు చెబితేనే ఆ సినిమా సూపర్ హిట్ అని ముందుగానే చెప్పేస్తారు.
అంతలా ఈయన తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు.త్రివిక్రమ్ గత సినిమా అల వైకుంఠపురములో సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించాయి.
ఈ సినిమా తర్వాత ఈయన మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు.
అయితే మహేష్ బాబుతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.
ఇప్పటికే ఈ సినిమా రెగ్యురల్ షూట్ స్టార్ట్ అయ్యింది.ఇప్పటి వరకు చాలా గ్యాప్ రావడంతో ఇక మహేష్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడట.
మరి ఈయన నెక్స్ట్ సినిమా ఎవరితో అనే విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఈ సినిమా పూర్తి అవగానే త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నెక్స్ట్ సినిమా చేయనున్నాడు అనే విషయం ప్రచారం జరుగుతుంది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వచ్చాయి.

మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.హ్యాట్రిక్ విజయం అందుకున్న ఈ కాంబో నాల్గవ సినిమా ఎప్పుడు అనేది అందరి ప్రశ్న.
అయితే అల్లు అర్జున్ ప్రెజెంట్ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ షూట్ పూర్తి అయ్యే లోపు త్రివిక్రమ్ బన్నీ సినిమా కోసం కథ రెడీ చేయనున్నాడని టాక్.
అయితే అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2 బిగ్గెస్ట్ హిట్ అయితే మాత్రం అల్లు అర్జున్ తన ప్లాన్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అని అప్పటి వరకు వీరి కాంబో ఉంటుంది అని చెప్పలేం అని అంటున్నారు.చూడాలి నాల్గవ సినిమా ఎప్పుడు ఉంటుందో.
అసలు ఉంటుందో లేదో.







