టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు.టాలీవుడ్ కు చాలా సూపర్ హిట్ సినిమాలు అందించాడు.
అయితే ఇటీవలే ఈయన తెరకెక్కించిన సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది అనుకుంటే అట్టర్ ప్లాప్ అయ్యింది.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూసారు.
ఆగష్టు 25న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది.కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది.
ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా ఎఫెక్ట్ పూరీ నెక్స్ట్ సినిమాపై కూడా పడింది.
దీంతో జనగణమణ సినిమా ఆగిపోయింది.లైగర్ సినిమా తర్వాత కూడా విజయ్ తోనే ‘జనగణమణ’ ప్రకటించి ఫస్ట్ షెడ్యూల్ కూడా కొద్దిగా ముగించారు.
కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబోలో లైగర్ భారీ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అందుకే పూరీ జగన్నాథ్ మరో హీరోను వెతుకున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే పూరీ నెక్స్ట్ సినిమాను బాలయ్యతో ఫిక్స్ చేసుకున్నట్టు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే వీరిద్దరి కాంబోలో పైసా వసూల్ వచ్చింది.
ఇది బాగానే ఆకట్టు కుంది.అందుకే వీరి కాంబోలో సినిమా అంటే బాలయ్య ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు.
చూడాలి ఈ కాంబో మరోసారి వస్తుందో లేదో.ఇక ప్రెజెంట్ బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమ చేస్తున్నాడు.
దీని తర్వాత అనిల్ రావిపూడితో చేయనున్నాడు.ఈ రెండు పూర్తి అయినా తర్వాతనే బాలయ్య పూరీ తో సినిమా తీసే అవకాశం ఉంది.