టార్గెట్ షర్మిల.. టీఆర్‌ఎస్‌‌కు షర్మిల ఇంత పెద్ద మేలు చేస్తుందా?

తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఎసరు పెడుతుంది.మగత నెలలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త చేసిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడైనట్లు సమాచారం.

 Telangana Congress Political Strategist Predicted That Ys Sharmila And Her Party-TeluguStop.com

వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ ఓట్లపై ప్రభావం చూపుతుందని, అధికారంలోకి వచ్చే అవకాశాలను దెబ్బతీస్తుందని సర్వేలో తెలినట్లు తెలుస్తోంది.ఈ నివేదిక టీ-కాంగ్రెస్‌లో పెద్ద చర్చకు దారి తీసింది.

అయితే షర్మిల పార్టీ వల్ల తమ ఓట్లపై ఎటువంటి ప్రభావం చూపదని టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే .ఈ విషయం అధికార టీఆర్ఎస్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది.టీఆర్‌ఎస్ పార్టీ దీనిని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్‌ను మరింత దిగజార్చడానికి వ్యూహాన్ని రచిస్తున్నట్లు కనిపిస్తోంది.

అందుకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ పార్టీ షర్మిలను టార్గెట్ చేసింది.

టీఆర్‌ఎస్‌ మంత్రులు నిరంజన్‌రెడ్డి, కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆమెపై అసెంబ్లీ స్పీకర్ పోచారంకు ఫిర్యాదు చేశారు.దీంతో టీఆర్‌ఎస్‌ తన దృష్టిని రేవంత్‌, ఇతర టీ-కాంగ్రెస్‌ నేతలకు బదులు షర్మిలపై మళ్లించింది.

షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌‌ను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ ప్లాన్ చేసింది.తద్వారా అధికార పార్టీకి పరోక్షంగా లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడుతన్నారు.

తెలంగాణ ప్రజల్లో షర్మిలకు ఉన్న ఆదరణ ఏంటో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన అవగాహన ఉంది.ఆమె పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత అవకాశాలు లేకపోయినప్పటికి ఓట్లను చీల్చడంలో మాత్రం గణనీయమైన పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నారు.

దీంతో టీ-కాంగ్రెస్‌కు మరింత నష్టం వాటిల్లుతుందని తద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తుంది.

Telugu Revanth Reddy, Sharmila, Telangana, Ts Congress, Ts Poltics, Ysr Telengan

ఇక షర్మిల కూడా తాను సీరియస్ రాజకీయ నాయకురాలినని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.పాదయాత్రలో టీఆర్ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు.తనను అసభ్య పదజాలంతో విమర్శించిన నిరంజన్ రెడ్డి గట్టీ కౌంటర్ ఇచ్చారు.

షర్మిల పార్టీ ఎఫెక్ట్ ఎంత ఉంటుందనేది రాజకీయవర్గాలు అంచనా వేయలేకపోతున్నాయి.తండ్రి పలుకుబడిని ఉపయోగించుకోవాలి అనుకున్న కూడా వైఎస్ ఇమేజ్ అనేది ప్రస్తుతం ఏపీకే పరిమితమైంది.

తెలంగాణలో ఎంత వరకు షర్మిలను గుర్తిస్తారు అనేది స్పష్టత లేదు.వైఎస్‌ ఫ్యాన్సే షర్మిలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలం.అంతకు మించి కనీస బలాన్ని కూడా ఆ పార్టీ చూపలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube