ఏపీ డిప్యూటీ స్పీకర్గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నియమితులైయ్యారు.ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అసెంబ్లీ బలాబలాల రీత్యా టీడీపీ పోటీ చేయలేదు.ఈ నేపథ్యంలో ఎన్నిక ఫలితాన్ని అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
ఈ సందర్భంగా కోలగట్లకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.
అనంతరం సీఎం జగన్ , మంత్రులు, ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడులు కలిసి కోలగట్లను సీటులో కూర్చొబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.







