తల్లి ప్రేమని వర్ణించడం ఎవరివల్లా కాదు.ఈ తల్లి ప్రేమ అనేది ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవరాశిలో ఒకే విధంగా ఉంటుంది.
ఈ విషయాన్ని నిజం చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి.
వాటిల్లో ఎక్కువగా ఏనుగులకు సంబంధించిన వీడియోలు ఈమధ్యకాలంలో ఎక్కువగా తారసపడుతున్నాయి.ముఖ్యంగా ఏనుగులు తన పిల్లకు రక్షణ ఇచ్చేటువంటి వీడియోలు ఎక్కువగా చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడున్న వీడియోని ఒకసారి గమనిస్తే, కొండ రోడ్డుపై వస్తున్న బస్సుకు ఏనుగులు దారి ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు.అయితే ఆ ఏనుగుల మధ్య ఓ పిల్ల ఏనుగుని కూడా ఇక్కడ గమనించవచ్చు.
దూరం నుంచి వస్తున్న బస్సును గమనించిన ఈ ఏనుగులు పిల్ల ఏనుగును పక్కకు తీసుకెళ్ళి తమ మధ్య రక్షణ కవచంలా తమ తొండాలతో రక్షిస్తూ బస్సుకు దారిస్తున్నాయి ఒకసారి ఇక్కడ చూడండి.ఈ క్యూట్ వీడియోను సుధారామన్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేయగా వెలుగు చూసింది.

తల్లి ఏనుగు తన పిల్లను ఏ విధంగా కాపాడుకుంటుందో ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.కష్ట సమయంలో పిల్ల ఏనుగును కవచంలా ఎలా కాపాడుకుంటాయో అర్ధం అవుతోంది.“అందుకే ఏనుగులను జెంటిల్ జెయింట్స్‌గా పిలుస్తున్నారు!” అని క్యూట్ క్యాప్షన్‌తో అతగాడు షేర్ చేశాడు.ఈ వీడియో ప్రస్తుతం ట్విటర్‌లో విపరీతమైన లైక్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది!’ అని ఒకరంటే, ‘ఆ ఏనుగుని చూసి మనం చాలా నేర్చుకోవాలి’ ఒక యూజర్ కామెంట్ చేసాడు.మీరు కూడా సదరు వీడియోని చూసి కామెంట్ చేయండి.







