యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో నాలుగేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతున్న ఇప్పటికి సెట్స్ మీదకు వెళ్ళలేదు.
దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇప్పటికే NTR30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై అంచనాలను పెంచేసాడు.
దీంతో ఫ్యాన్స్ వెయిటింగ్ మరింత ఎక్కువ అయ్యింది.కానీ వీరి ఎదురు చూపులు ఫలించడం లేదు.
కొరటాల అనుకున్న సమయానికి సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోతున్నారు.దీనికి అనేక కారణాలు ఉన్నాయి.మరి ఎన్టీఆర్ 30వ సినిమా లాంచింగ్ ఎప్పుడు అవుతుందో పక్కన పెడితే ఈ సినిమా గురించి రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.తాజాగా మరో బజ్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారు.
కానీ ఈమె ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకుంది.దీంతో మళ్ళీ కొరటాల ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట సాగిస్తూనే ఉన్నాడు.
ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మల పేర్లు వినిపించిన ఇప్పుడు మాత్రం మరో హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు టాక్ బయటకు వచ్చింది.

ఎన్టీఆర్ జోడీగా కియారా అద్వానీ ని తీసుకున్నట్టు టాక్.మరి ఇదే నిజం అయితే వీరి జోడి అదిరిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.చూడాలి మరీ ఈమెను అయినా ఫిక్స్ చేస్తారో లేదంటే మరో హీరోయిన్ వినిపిస్తుందో.
ఇక ఈ సినిమా కోసం తారక్ భారీగా బరువు తగ్గి కొత్త లుక్ లోకి మారిపోనున్నాడు.దీంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.







