సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఎవరూ అడ్డుకున్నారని ప్రశ్నించారు.కేంద్రమే అడ్డుకుందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తక్షణమే పది శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
గిరిజన సమస్యలపై మొదట నుంచి కొట్లాడి జైలు పాలైంది బీజేపీ నేతలేనని బండి సంజయ్ తెలిపారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడమే కావాలన్న ఆయన.దొంగ జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంటే వదిలిపెట్టమని హెచ్చరించారు.నయా నిజాం ఖాసిం చంద్రశేఖర రజ్వి పాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలిగిస్తామని స్పష్టం చేశారు.







