దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ తెలుగులో కూడా ప్రారంభమై ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది.ఇక తాజాగా ఆరవ సీజన్ కూడా ప్రారంభం అయ్యి ఇప్పటికే రెండు వారాలు గడిచింది.
మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ నుండి కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయలేదు.కానీ రెండవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఇద్దరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.
ఇక శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున హౌజ్ మెట్స్ మీద ఫుల్ ఫైర్ అయ్యాడు.ఈ వారంలో ఆట ఆడని 9 మంది కంటెస్టెంట్లను నిలబెట్టి మిగిలిన కంటెస్టెంట్ల చేత ఓటింగ్ వేయించాడు.
ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో వాసంతి, శ్రీసత్య, కీర్తిభట్, శ్రీహాన్ , బాల ఆదిత్య, మెరీనా రోహిత్, అభినయశ్రీ, సుదీప, షానీ ఇలా మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లను పక్కన పెట్టాడు.ఆ తర్వాత మొదటగా కీర్తి భట్ తో మాట్లాడుతూ.
బిగ్ బాస్ కి రాకముందు నీ లైఫ్ లో చాలా చేదు అనుభవాలు ఉన్నాయి.కానీ ఇప్పుడు నీకు లైఫ్ లో మరో ఛాన్స్ వచ్చింది…దాన్ని నువ్వు ఉపయోగించుకోవటం లేదు .ఈ వారం నువ్వు ఆట ఆడలేదు అని చెప్పుకొచ్చాడు నాగార్జున క్లాస్ పీకాడు.
ఇక అద్దం ముందు నిలబటానికి చూపించే ఇంట్రెస్ట్ ఆటలో చూపించు అని శ్రీహాన్ కి క్లాస్ పీకాడు.

ఇక శ్రీ సత్య గురించి మాట్లాడుతూ.నీ పేరులో సత్య ఉంది.మరి నీలో సత్యం ఉందా? అని ప్రశ్నించాడు.నువ్వు తిండి మీద పెట్టే శ్రద్ద ఆట మీద పెట్టటం లేదని సీరియస్ అయ్యాడు.
ఇక షానీ కూడా ఈ వారం ఆట ఆడలేదని, అవకాశాలు ఎప్పుడు మన దగ్గరికి రావు మనమే వాటిని తీసుకోవాలని చెప్పాడు.ఇక అభినయ, సుదీపా విషయంలో కూడా ఈ వారం గేమ్ లో సరిగా పార్టిసిపేట్ చేయలేదని సీరియస్ అయ్యాడు.
మీరందరూ తిని పడుకోవటానికి ఇక్కడికి వచ్చుంటే బిగ్ బాస్ కి మీరు అవసరం లేదు .ఇప్పుడే లగేజ్ తీసుకొని వెళ్ళిపొండి అంటూ సీరియస్ అయ్యాడు.







