ఓ వైపు టెక్నాలజీ పెరుగుతోంది, మరోవైపు సైన్స్ దినదినాభివృద్ధి చెందుతోంది.అయినప్పటికీ మనుషులకి అంతుచిక్కని రహస్యాలు ఈ ప్రకృతిలో అనేకం వున్నాయి.
ఇటీవలి కాలంలో అంతరిక్షానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆవిష్కరణ ప్రజలను ఆశ్చర్యపరిచింది.అయితే అంతరిక్షం ఎంత రహస్యమో, సముద్ర గర్భం కూడా అంతే రహస్యమని అందరికీ తెలిసినదే.
నేటికీ, సముద్రంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి అనడంలో సందేహమే లేదు.వాటి గురించి మానవులు ఇప్పటికీ కనుగొనలేకపోయారు.
ఇటీవల ఒక ఆస్ట్రేలియన్ మత్స్యకారుడు ఓ వింత షార్క్‌ను కనుగొన్నాడు.
ఇక ఈ షార్క్ సముద్రపు రహస్యాలలో ఒక భాగమని అనిపించక మానదు.
ఆస్ట్రేలియా అనేక అడవి, విచిత్రమైన జీవులకు నిలయంగా పేరుగాంచింది.వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివసించే ట్రాప్‌మాన్ బెర్మగుయ్ అనే మత్స్యకారుడు ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లాడు.
అప్పుడు ఓ వింత షార్క్ ను చూసి అతడు షాక్ అయ్యాడు.దీని ఫొటోని అతడు తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశాడు.
ట్రాప్‌మన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో సముద్ర జీవులకు సంబంధించిన ఫోటోలను తరచుగా పంచుకుంటూనే ఉంటాడు, కానీ ఇప్పుడు అతను షేర్ చేసిన షార్క్ చాలా భయానకంగా ఇతర సొరచేపల కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.
అతడు షేర్ చేసిన ఫొటోలోని షార్క్ ఎలా ఉందంటే, గోధుమ రంగులో చాలా రఫ్ స్కిన్ కలిగి ఉంది.
ఇతర సొరచేపలు పూర్తి భిన్నంగా వుంది.కళ్ళు చాలా పెద్దవిగా అచ్చం మనిషి కల్లులాగే వున్నాయి.
దాని దంతాలు, చిగుళ్ళ ఆకారం, ముక్కు భాగం కూడా చిత్ర విచిత్రంగా ఉన్నాయి.పరితలం నుండి 650 మీటర్ల దిగువన దీనిని పట్టుకున్నట్లు ట్రాప్‌మాన్ తెలిపాడు.
దీని గురించి ట్రాప్‌మాన్ న్యూస్‌వీక్ అనే ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.తాను పట్టుకున్న షార్క్ కఠినమైన చర్మ సొరచేప అని, ఇది సాధారణంగా 600 మీటర్ల లోతులో మాత్రమే నివసిస్తుందని, శీతాకాలంలో మాత్రమే వీటిని పట్టుకోగలం అని తెలిపారు.