మలయాళనటుడు దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి క్లాసికల్ హిట్ చిత్రంగా నిలిచింది.
ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.తెలుగు తమిళ మలయాళ భాషలలో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని హిందీలో కూడా డబ్ చేసే విడుదల చేశారు.
ఇక హిందీలో కూడా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో అక్కడ చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా దుల్కర్ సల్మాన్ కు విలేకరుల నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉండబోతుందా అని ప్రశ్నించారు.ప్రస్తుత కాలంలో ఒక సినిమా సూపర్ హిట్ అయితే తప్పకుండా ఆ సినిమాకు సీక్వెల్ చిత్రం రావడం సర్వసాధారణం.
ఈ క్రమంలోనే సీతారామం సినిమాకి సీక్వెల్ చిత్రం ఉండబోతుందా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది.అయితే ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఇదే ప్రశ్న ఎదురవడంతో దుల్కర్ సల్మాన్ ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆ సినిమా ప్రేక్షకుల మదిలో క్లాసికల్ చిత్రంగా నిలిచిపోతుంది.ఇలా క్లాసికల్ హిట్ అయినటువంటి ఒక సినిమాని మరి టచ్ చేయకూడదని నేను నటుడు కాకముందు నుంచే తెలుసుకున్న విషయం.తాను ఈ సినిమా కథను నమ్మి సినిమా చేశానని ఈ సినిమా అనుకున్న విధంగానే ప్రతి ఒక్కరికి నచ్చిందని ఈయన వెల్లడించారు.ఇలాంటి ఒక క్లాసికల్ మూవీకి కొనసాగింపు ఉండదని నేను అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ఈ సినిమా సీక్వెల్ చిత్రం ఉండబోదని ఈయన క్లారిటీ ఇచ్చారు.







