గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలను ఒక్క వాష్ లోనే తెల్లగా మెరిపించుకోండిలా!

దంతాలు( teeth ) తెల్లగా ముత్యాల మాదిరి మెరుస్తూ కనిపిస్తే మనలోనే ఆత్మ విశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది.నలుగురిలో చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతారు.

 How To Get Rid Of Yellow Teeth Naturally! Yellow Teeth, White Shiny Teeth, Oral-TeluguStop.com

కానీ కొందరి దంతాలు గార పట్టి పసుపు రంగులోకి మారుతుంటాయి.ఆహారపు అలవాట్లు, దంత సంరక్షణ లేకపోవడం, మద్యపానం, ధూమపానం, పాన్ గుట్కా వంటివి తరచూ నమలడం తదితర కారణాల వల్ల దంతాలు రంగు మారిపోతుంటాయి.

ఇలాంటి దంతాలు కలిగిన వారు ఇతరులతో మాట్లాడేందుకు సంకోచిస్తుంటారు.నలుగురిలో నవ్వడానికి కూడా చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే కేవలం ఒక్క వాష్ లోనే మీ దంతాలు తెల్లగా ముత్యాల మాదిరి మెరుస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), పావు టేబుల్ స్పూన్ సాల్ట్( Salt ), వన్ టేబుల్ స్పూన్ మీ రెగ్యులర్ టూత్ పేస్ట్( Tooth paste ) వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్(Olive oil ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని మరోసారి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్‌ సహాయంతో దంతాలకు అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు సున్నితంగా తోముకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా దంతాలను క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా చేస్తే ఒక్క వాష్ లోనే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు చాలా వరకు తెల్లగా మారతాయి.రెగ్యులర్ గా ఈ రెమెడీని పాటిస్తే ముత్యాలు లాంటి దంతాలు మీ సొంతం అవుతాయి.

కాబట్టి పసుపు దంతాలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.దంతాలను తెల్లగా మెరిపించుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube