టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.ఈమె అందం, అభినయం అన్ని కూడా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి.
పెళ్లి సందడి సినిమాతో ఈమె వెండి తెరమీద అడుగు పెట్టింది.ఈ సినిమా తర్వాత శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకు పోతుంది.
ఈమె ఆఫర్స్ వచ్చే కొద్దీ రేటు కూడా భారీగా పెంచుకుంటూ పోతుంది.రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా ఖర్చులు సైతం అదనంగా వసూలు చేస్తుందట.
తాజాగా ఈమె మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. #PVT04 సినిమాను శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై త్రివిక్రమ్ భార్య సౌజన్యతో కలిసి నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూట్ కోసం శ్రీలీల రెమ్యునరేషన్ కాకుండానే అదనంగా హోటల్ ఖర్చులు కూడా వసూలు చేస్తుందట.మూడు వారాల పాటు ఈమె షూట్ లో పాల్గొనాల్సి ఉండగా.
ఆమె తల్లితో కలిసి నెల రోజుల పాటు హైదరాబాద్ లోనే 7 స్టార్ హోటల్ సూట్ బుక్ చేయగా దీనికి రోజుకు 20 వేలకు పైగానే పే చేస్తున్నారట.ఈ షూట్ అయిపోయే సమయానికి దడపా 6 లక్షల ఖర్చు అవ్వనుందట.

ఇలా అదనపు ఖర్చుల కోసం కూడా నిర్మాతల దగ్గర వసూళ్లు చేస్తుంటే ఇక బడ్జెట్ ఎక్కువ కాక ఏమవుతుంది అంటూ వాపోతున్నారు నిర్మాతలు. అయితే ఈ వార్త నిన్నటి నుండి వైరల్ అవుతున్న నేపథ్యంలో అందరికి ఒక డౌట్ వస్తుంది.
ఇటీవలే బంద్ నేపథ్యంలో నిర్మాతల గిల్డ్ ట్రావెల్ ఖర్చులు, ఉండడానికి కూడా హీరోయిన్ ల రెమ్యునరేషన్ లోనే ఉంటుంది అని చెప్పుకొచ్చారు.మరి ఇప్పుడు మాత్రం ఈ వార్త బయటకు వచ్చింది.
దీంతో ఈమెకు ఈ రూల్ వర్తించదా అంటూ కామెంట్ చేస్తున్నారు.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ నెట్టింట ఈ వార్త మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది.







