తెలుగులో తక్కువ సినిమాలలోనే నటించినా నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు.రాజావారు రాణివారు సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన కిరణ్ అబ్బవరంకు తొలి సినిమాతోనే షాక్ తగిలింది.
అయితే ఈ సినిమా నటుడిగా కిరణ్ అబ్బవరంకు మంచి పేరును తెచ్చిపెట్టింది.అయితే ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన ఎస్సార్ కళ్యాణమండపం సినిమా సక్సెస్ సాధించింది.
ఎస్సార్ కళ్యాణమండపం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు కిరణ్ అబ్బవరంకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.అయితే కిరణ్ అబ్బవరంకు ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుస షాకులు తగులుతున్నాయి.
సెబాస్టియన్ pc 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాలతో షాకులు తగిలాయి.ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం.
ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు సినిమాలు ఉండగా ఈ మూడు సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించి కిరణ్ అబ్బవరం కోరుకున్న హిట్ ను అందిస్తాయని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కిరణ్ అబ్బవరం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైంది.
సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రమే కిరణ్ అబ్బవరం కెరీర్ పరంగా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంటుంది.

కిరణ్ అబ్బవరం తర్వాత సినిమాలు కూడా ఫ్లాపైతే మాత్రం ఆయన మరో వరుణ్ సందేశ్ అవుతారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.కిరణ్ అబ్బవరం వచ్చిన ప్రతి ఆఫర్ కు ఓకే చెబుతున్నారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ సైతం ఆయనకు వరుస ఫ్లాపులు రావడంతో తెగ ఫీలవుతున్నారు.
ఫ్యాన్స్ కోసం అయినా కథల ఎంపిక విషయంలో కిరణ్ అబ్బవరం మారతారేమో చూడాల్సి ఉంది.







