జబర్దస్త్ కార్యక్రమంతో స్టార్ హోదా దక్కించుకున్న హైపర్ ఆది గత కొన్ని నెలలుగా ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో మాత్రమే కనిపిస్తూ ఎంటర్టైన్మెంట్ అందించిన హైపర్ ఆది తిరిగి జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఈ వారం జబర్దస్త్ లో హైపర్ ఆది చేసిన స్కిట్ హైలైట్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.జబర్దస్త్ లోకి హైపర్ ఆది రీఎంట్రీ భారీగా జరిగింది.
అతన్ని రీ ఎంట్రీ స్కిట్ భారీగా ఉండాలని ఉద్దేశంతో సూపర్ హిట్ సినిమాలన్నింటినీ ఒక పేరడీ గా చేసి కామెడీ చేసే ప్రయత్నం చేశాడు.బాహుబలి, కే జి ఎఫ్, ఆర్ ఆర్ ఆర్, పుష్ప, విక్రమ్ ఇలా సూపర్ హిట్ సినిమాల యొక్క పేరడీ లు చేస్తూ కామెడీ పండించాలని ఆది చేసిన ప్రయత్నం నవ్వు తెప్పించింది.
కానీ ఆయా సినిమాల యొక్క హీరోల అభిమానులకు కోపం తెప్పించింది.
ముఖ్యంగా టాలీవుడ్ చెప్పిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా పేరడీ సందర్భంగా మల్లీ పాత్ర ను పట్టుకొని నువ్వు ఆ కొమ్మా ఉయ్యాల పాట పాడుకుంటే ఇంత జరిగేదే కాదు కదా అంటూ కౌంటర్ వేశాడు.
సినిమా లో ఆ సన్నివేశం తర్వాతే అసలు కథ మొదలవుతుంది.కనుక రాజమౌళి సినిమాపై హైపర్ ఆది కౌంటర్ వేసినట్లుగా కొందరు అభిప్రాయం చేస్తున్నారు.టాలీవుడ్ జక్కన్న వంటి అతి పెద్ద దర్శకుడు తెరకెక్కించిన సినిమా పైనే కౌంటర్ వేసే అంతటి స్టార్ వి అయ్యావా అంటూ హైపర్ ఆదిని కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఈ సమయంలో అతడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.
గతంలో కూడా హైపర్ ఆది పై చాలా విమర్శలు వచ్చాయి.ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించిన హైపర్ ఆది ఈ సమయంలో కూడా మౌనంగా ఉండి మరో స్కిట్ లో టాలీవుడ్ జక్కన్న పై తనకున్న గౌరవాన్ని అభిమానాన్ని చాటుకుంటాడేమో చూడాలి.







