మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటి వరకు షురూ అవ్వలేదు.
దాంతో సినిమాకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అసలు ఈ సినిమా విడుదల వాయిదా ఎంత వరకు నిజం అంటూ కొందరు సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
విడుదల కాకపోవచ్చు అంటూ వారు తెగ ప్రచారం చేస్తున్నారు.అందుకు కారణం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా ప్రారంభం అవ్వకపోవడమే.
యూనిట్ సభ్యులు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను తక్కువ చేసి లో హైప్ తో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.అంటే ఆచార్య స్థాయి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలని వారు భావించడం లేదు.
గతంలో ఆచార్య సినిమాకి భారీగా హైప్ క్రియేట్ చేసి నిరాశ పరిచారు.కానీ ఈసారి నిరాశ పడకుండా సినిమా ఉంటుంది.
అలాగే అంచనాలను కూడా భారీగా పెంచకుండా ఉండాలని భావిస్తున్నారు.
చిరంజీవి సూచన మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు చివరి రెండు వారాల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు, అందులో భాగంగానే ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించ లేదని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
వచ్చే సోమవారం నుండి ప్రమోషన్ కార్యక్రమాలు రెగ్యులర్ గా ఉంటాయి.కనుక సినిమా విడుదలకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు అంటూ మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతుంది.
దాంతో మెగా అభిమానులు ఒకింత ఊరట చెందే అవకాశం ఉంది.మీడియాలో జరుగుతున్నట్లు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరగనంతమాత్రాన విడుదల వాయిదా అని అనుమానం చెందాల్సిన అవసరం లేదు అంటూ మెగా ఫ్యాన్స్ కి మెగా కాంపౌండ్ నుండి అధికారికంగా సమాచారం అందుతుంది.
కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేయడం పక్కా.!
.






