ఆ జానర్ లో హీరో యశ్ తదుపరి చిత్రం.. ఇక కేజిఎఫ్ రికార్డు బద్దలే?

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు కన్నడ నటులు అంటే కేవలం ఉపేంద్ర సుదీప్ వంటి నటులు మాత్రమే తెలిసి ఉండేది.ఎప్పుడైతే కేజిఎఫ్ సినిమా విడుదలైందో ఒక్కసారిగా ఈ సినిమా హిట్ అవడంతో యశ్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.

 Hero Yash Next Movie In That Genre Will Kgf Break The Record Details, Yash',nex-TeluguStop.com

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం సాధించడంతో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు తొంగి చూసింది.ఇలా కే జి ఎఫ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన యశ్ కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాతో ఏకంగా 1250 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించారు.

ఇలా కే జి ఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యశ్ తదుపరి సినిమా గురించి ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యశ్ ఏ జానర్ లో సినిమా చేస్తారని అందరూ ఆరా తీశారు.

అయితే ఎస్ తన తదుపరి చిత్రాన్ని మఫ్టీ ఫెమ్ డైరెక్టర్ నార్తన్ దర్శకత్వంలో చేస్తున్నాడు.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసిన చిత్ర బృందం త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా ఏ జానర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందనే విషయానికి వస్తే.

Telugu Northern, Yash, Kgf Chapter, Pooja Hegde-Movie

యశ్ తన తదుపరి సినిమా కూడా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.ఇక కే జి ఎఫ్ సినిమా కూడా ఇదే జానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరోసారి అదే తరహా జానర్ సినిమా అంటే కే జి ఎఫ్ రికార్డులు బద్దలు కావడం గ్యారెంటీ అంటూ అభిమానులు భావిస్తున్నారు.ఈ సినిమాలో యశ్ సరసన పూజ హెగ్డే నటిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయం గురించి మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube