అలియాభట్ ప్రేమించినట్టుగా రణ్ బీర్ కపూర్ ఆమెను ప్రేమించడం లేదా.. ఆ ఘటనతో ట్రోల్స్?

బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్,రణ్ బీర్ కపూర్ ల గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవలే ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

 Hero Ranbir Kapoor Was Pushed Alia Bhatt Details, Ranbir Kapoor, Alia Bhatt, Bol-TeluguStop.com

అంతేకాకుండా అలియా భట్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలిసిందే.కాగా ఈ వీరిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇది వలే విడుదల అయ్యి పరవాలేదు అనిపించింది.ఇది ఇలా ఉంటే తాజాగా ముంబైలోని కరణ్ జోహార్ ఆఫీస్ ముందు దర్శకుడు అయాన్ ముఖర్జీ,రణ్ బీర్ దంపతులు సందడి చేశారు.

ఈ నేపథ్యంలోనే రణ్ బీర్ చేసిన పనికి నెటిజెన్స్ ట్రోలింగ్స్ చేస్తున్నారు.

కరణ్ జోహార్ ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడటానికి అలియా రణ్ బీర్ సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో రణ్ బీర్ క్రాఫ్ ని అలియా సరిచేసే ప్రయత్నం చేసింది.రెండవ సారి కూడా రణ్ బీర్ క్రాఫ్ ని సెట్ చేయడానికి అలియా ప్రయత్నించడంతో రణ్ బీర్ వెంటనే ఆమె చేయిని పక్కకు తోసేయడం ఆసక్తికరంగా మారింది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ ఈ జంట పై ట్రోలింగ్స్ చేస్తున్నారు.కొందరు నెటిజన్స్ ఆలియా కి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు రణ్ బీర్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా గత కొద్ది రోజులుగా ఆలియా భట్ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.తాజాగా మరొకసారి ఈ జంట ట్రోలింగ్స్ ఎదుర్కొంది.ఇకపోతే ఈ జంట తాజాగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటుంది అని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా భావించారు.

కానీ ఊహించని విధంగా ఈ సినిమా ఇలా కలెక్షన్ల విషయంలో, అలాగే విడుదలైన మొదటి రోజు నెగిటివ్ టాక్సెస్ సొంతం చేసుకోవడంతో కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube