రన్నింగ్ ట్రైన్‌లో దొంగతనం చేయబోయి ఇరుక్కుపోయాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో

కొందరు దొంగతనానికి అలవాటు పడి, ఇంకే ఇతర పనులు చేయడానికి ఆసక్తి చూపరు.అలాంటి వారు జల్సాలకు అలవాటు పడి నిత్యం దొంగతనాలు చేస్తుంటారు.

 He Was Going To Steal In A Running Train And Got Stuck , Running Train, Theif, V-TeluguStop.com

ఒక్కోసారి వారి ఏమీ కలిసి రాదు.దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిపోతారు.

ఒక్కోసారి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.ఇలాంటి ఘటన తాజాగా జరిగింది.

ఓ వ్యక్తి రన్నింగ్ ట్రైన్‌లో సెల్ ఫోన్ కొట్టేయాలనుకుని భావించి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బీహార్‌లోని బెగుసరాయ్‌లో కదులుతున్న రైలు కిటికీలో నుంచి మొబైల్ ఫోన్‌ను దొంగిలించడానికి ప్రయత్నించిన ఓ దొంగ తన ప్రాణాలను పణంగా పెట్టాడు.

స్టేషన్‌ నుంచి స్టార్ట్ అవుతున్న ట్రైన్ కిటికీలో చేయి పెట్టాడు.ట్రైన్ లోపల ఉన్న ఓ ప్రయాణికుడి మొబైల్‌ లాక్కెళ్లేందుకు పన్నాగం పన్నాడు.

అయితే ఆ ప్రయాణికుడు వెంటనే అప్రమత్తమై అతడి చేయి పట్టుకున్నాడు.

మరో ప్రయాణికుడు కూడా ఆ ప్రయాణికుడికి సాయపడ్డాడు.

దొంగ మరో చెయ్యిని గట్టిగా పట్టుకుని లాగాడు.ఇంతలోనే ట్రైన్ వేగం పుంజుకుంది.

రైలు స్టేషన్ నుండి బయలుదేరుతున్నా, వారు ఆ దొంగ చేయి వదలలేదు.కాసేపటికి ట్రైన్ వేగంగా కదులుతూ ముందుకు సాగింది.

దీంతో ఎక్కడ వారు ఆ దొంగ చేయి వదిలేసినా, అతను చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.ఇలా ఆ దొంగ కదులుతున్న రైలు కిటికీకి వేలాడుతూ సుమారు 15 కి.మీ.దూరం ప్రయాణించాడు.దీనిని కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా బాగా వైరల్ అయింది.ట్రైన్ ముందుకు కదులుతున్నంత సేపు ఆ వ్యక్తికి చాలా భయం వేసింది.

తనను పట్టుకున్న వారు ఏ మాత్రం చేయి విడిచినా అతడు రైలు వేగానికి కిందికి పడిపోయి వెంటనే చనిపోతాడు.దీంతో ఆ దొంగకు ప్రాణభయం పట్టుకుంది.తనను అస్సలు విడవద్దని, చేయి గట్టిగా పట్టుకోవాలని ఆ ట్రైన్ రన్నింగ్ లో ఉన్నంత సేపు ఆ దొంగ అరుస్తూనే ఉన్నాడు.అనంతరం ఖగారియా స్టేషన్‌లో రైలు ఆగింది.

అప్పుడు ఆ దొంగను ప్రయాణికులు పట్టుకుని, జీఆర్పీకి అప్పగించారు.అతని పేరు పంకజ్ కుమార్ అని పోలీసులు తేల్చారు.

అతను బెగుసరాయ్‌లోని సాహెబ్‌పూర్ కమల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉంటాడని తెలుసుకున్నారు.అతడిపై కేసు నమోదు చేసి, జైలుకు పంపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube