ఎద్దును బైక్‌పై ఎక్కించుకుని ఎంచక్కా తీసుకెళ్లాడు.. వీడియో వైరల్

మీరు ఏదైనా ఎద్దును వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలంటే ఏం చేస్తారు? ఏదైనా చిన్న ట్రక్కు, టాటా ఏస్ లాంటి వాహనాలను తీసుకొస్తారు.దానిపై జాగ్రత్తగా ఎద్దును ఎక్కించుకుని మరో ప్రాంతానికి తరలిస్తారు.

 He Took The Bull On A Bike And Picked It Up The Video Went Viral ,ox,bike, Vira-TeluguStop.com

కానీ ఓ వ్యక్తి విభిన్నంగా ప్రయత్నించాడు.తన చిన్న బైక్‌పైనే ఎద్దును ఎక్కించుకుని ఎంచక్కా మరో ప్రాంతానికి వెళ్లాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అని చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు కొంత మంది ద్విచక్ర వాహనదారులను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.

బైక్‌లపై ముగ్గురు నుంచి ఏడుగురు వరకు ప్రయాణిస్తూ కనపడతారు.అంతేకాకుండా భారీగా పొడవున్న ఐరన్ రాడ్లను మోసుకెళ్తూ ఉంటారు.

ఈ రెండు ఘటనలూ చాలా ప్రమాదకరం.అయినప్పటికీ మరో ప్రత్యామ్నాయం లేదన్నట్లు వారు అలాగే చేస్తుంటారు.

అయితే ఇలాంటివి మనకు కొత్త కాకపోయినా, ఓ ఆశ్చర్యకరమైన విషయం ఇటీవల జరిగింది.ఓ వ్యక్తి ఏదో కుక్క పిల్లను ఎక్కించుకున్నట్లు ఏకంగా ఎద్దును బైక్ ఎక్కించుకున్నాడు.

ఆటోకు, ఇతర వాహనాలకు డబ్బులు ఖర్చు అవుతాయని భావించాడో ఏమో సింపుల్‌గా బైక్‌పైనే చక్కగా ఆ ఎద్దును తీసుకుపోయాడు.దీనిని కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు.

animalsinthenaturetoday అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను ఇటీవల పోస్ట్ చేశారు.దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

ఒక మనిషి కూర్చోగలిగే చోటున్న ప్రాంతంలో అంత పెద్ద ఎద్దు ఎలా కూర్చుందోనని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఆ ఎద్దు కూడా ఏ మాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా జాగ్రత్తగా ప్రయాణించిందని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube