డాక్టర్ అలేఖ్య ట్రీట్మెంట్ పై నమ్మకంగా ఉన్న ఉప్పెన బేబమ్మ

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని అందరితో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న కృతి శెట్టి ఆ తర్వాత కూడా వరుసగా రెండు మూడు సినిమాలతో ఆకట్టుకుంది.

 Krithy Shetty Hopes On Aa Ammai Gurinchi Neeku Cheppali Movie , Aa Ammai Gurinc-TeluguStop.com

ఆ తర్వాతే అసలు సమస్య అన్నట్లుగా వరుసగా వచ్చిన మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.దాంతో కృతి శెట్టి కెరియర్ మూడు నాలుగు ముచ్చటే అన్నట్లుగా కొందరు విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

ఇప్పుడు కృతి శెట్టి ఆశలన్నీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా పై ఉన్నాయి.సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ సినిమాకు ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్ర గంటి దర్శకత్వం వహించాడు.

ఆయన సినిమా అంటే హీరోయిన్ కి మంచి ప్రాముఖ్యత ఉంటుంది.కనుక ఈ సినిమాలో కృతి శెట్టి మంచి పాత్ర దక్కించుకొని ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం డాక్టర్ అలేఖ్య పాత్రలో కృతి శెట్టి కనిపించబోతుంది.ఎప్పుడు మూడ్ ఆఫ్ లో ఉండే అమ్మాయి పాత్రలో కృతి శెట్టి నటించింది.

అలాంటి అమ్మాయిని దర్శకుడు అయిన సుధీర్ బాబు హీరోయిన్ గా నటింపజేసి ఆమెని స్టార్ట్ ని చేయాలని భావిస్తాడు.ఆమెనే ఎందుకు హీరోయిన్ గా నటింపజేయాలని సుదీర్ బాబు అనుకున్నాడు.

అసలు సినిమాలో ఆ సినిమా కథ ఏంటి అనేది రేపు సినిమా విడుదలయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఈనెల 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కృతి శెట్టికి సక్సెస్ ని తెచ్చిపెడుతుందా లేదంటే మరో ఫ్లాప్ గా నిలిచి ఆమె కెరియర్ మరింతగా ప్రమాదంలో పడేలా చేస్తుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube