ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి పై సోషల్ మీడియా లో ఉద్దేశ పూర్వకంగా వాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన వాసిరెడ్డి పద్మ.వాసిరెడ్డి పద్మ,మహిళా కమీషన్ చైర్ పర్సన్ ముఖ్యమంత్రి సతీమణి భారతి గత ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు వక్రీకరించి ఒక వర్గం సోషల్ మీడియా లో చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన ఆధారాలు ను డిజిపి కి సమర్పించాము మహిళలు ను అడ్డుపెట్టుకుని వారినే లక్ష్యంగా పెట్టుకుని నీచ రాజకీయాలు చేయటం తగదు.
లిక్కర్ మాఫియా లో భారతి పై నిరాధారమైన ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి ని మానసికంగా కుంగతీయాలనే ఆలోచనలో తేదేపా నాయకులు ఉన్నారు.మహిళలు ను లక్ష్యంగా పెట్టుకుని మెట్టమెదటి సారిగా నాడు జగన్ మోహన్ రెడ్డి కుటుంబలోని మహిళల పై రాజకీయ దాడి చేసింది తెలుగుదేశం పార్టీయే.
ముఖ్యమంత్రి తో తేల్చుకోవాల్సిన విషయాలు ను ఆయనతో తేల్చుకోలేక ఆయన భార్య పై బురద చల్లాలనుకోవటం నీచమైన సంస్కృతి మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవారికి కఠినమైన సంకేతాలు పంపాలి.