వారిలో అమ్మను చూసుకున్నాను.. ప్రముఖ నటి రష్మిక కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మికకు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.రష్మిక నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.

 Rashmika Shocking Comments About Friends And Hostel Life Details Here , Hostel L-TeluguStop.com

గోల్డెన్ లెగ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రష్మిక టాలీవుడ్ ప్రాజెక్ట్ లతో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్ లపై కూడా దృష్టి పెడుతున్నారు.బాలీవుడ్ లో రష్మిక నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఈ రెండు సినిమాలలో కనీసం ఒక సినిమా సక్సెస్ సాధించినా రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది.తమిళంలో గతంలో రష్మిక సుల్తాన్ అనే సినిమాలో నటించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

అయితే తమిళంలో రష్మిక మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.తెలుగులో వారసుడు పేరుతో తమిళంలో వారీసు పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక నటిస్తున్నారు.

Telugu Golden Leg, Hostel, Pushpa Rule, Rashmika-Movie

తెలుగులో రష్మిక పుష్ప ది రూల్ లో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే.పుష్ప ది రైజ్ సినిమాకు ఊహించని స్థాయిలో అవార్డులు వచ్చాయనే సంగతి తెలిసిందే.తాజాగా ఒక సందర్భంలో రష్మిక తన ఫ్రెండ్స్, హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తన బాల్యం హాస్టల్ లోనే గడిచిపోయిందని రష్మిక తెలిపారు.

Telugu Golden Leg, Hostel, Pushpa Rule, Rashmika-Movie

తాను ఎక్కడికి వెళ్లినా నా చుట్టూ ఫ్రెండ్స్ ఉండేవారని నా ఫ్రెండ్స్ లోనే ఫ్యామిలీ మెంబర్స్ ను చూసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.టీచర్స్ ను నేను ఎంతగానో గౌరవించేదాననినని టీచర్స్ లో అమ్మను చూసుకునేదానినని రష్మిక పేర్కొన్నారు.హైస్కూల్ లో నేను యావరేజ్ విద్యార్థినని ప్లస్2, డిగ్రీలో నేను క్లాస్ టాపర్ అని రష్మిక చెప్పుకొచ్చారు.మ్యాథ్స్, బయాలజీ అంటే నాకు చాలా భయమని రష్మిక తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube