పవన్ కు త్రివిక్రమ్ అన్యాయం చేస్తున్నారా.. పవన్ కు రీమేక్స్ ఎందుకంటూ?

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు తెరకెక్కాయి.ఈ మూడు సినిమాలలో జల్సా హిట్ గా నిలవగా అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

 Netizens Negative Comments About Trivikram Srinivas Details, Negative Comments,-TeluguStop.com

అయితే ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన మరో సినిమా అజ్ఞాతవాసి ఏ రేంజ్ డిజాస్టర్ అనే సంగతి తెలిసిందే.అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా తెరకెక్కలేదు.

అయితే త్రివిక్రమ్ పవన్ సినిమాకు డైరెక్షన్ చేయకపోయినా భీమ్లా నాయక్ సినిమాకు తన వంతు సహాయసహకారాలు అందించారు.అయితే ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ అనే సంగతి తెలిసిందే.

పవన్ హీరోగా సముద్రఖని డైరెక్షన్ లో వినోదాయ సిత్తం రీమేక్ తెరకెక్కనుండగా ఈ సినిమా కథ, కథనంలో కూడా త్రివిక్రమ్ తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు.

అయితే త్రివిక్రమ్ తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాకు కూడా దర్శకత్వం వహించలేదనే సంగతి తెలిసిందే.

Telugu Bheemla Nayak, Pawan Kalyan, Pawan Trivikram, Vinodaya Sitham-Movie

తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలకు అదిరిపోయే కథలను సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్ పవన్ కు మాత్రం రీమేక్ సినిమాలను సూచించడం గమనార్హం.ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Bheemla Nayak, Pawan Kalyan, Pawan Trivikram, Vinodaya Sitham-Movie

పవన్ ప్రస్తుతం తన సినిమాల విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూర్తిస్థాయిలో ఆధారపడుతున్నారు.అయితే పవన్ కు రీమేక్ సినిమాల కంటే స్ట్రెయిట్ సినిమాలే బెస్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.భవిష్యత్తు ఇంటర్వ్యూలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ విమర్శల గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కిస్తూ ఆ సినిమాతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube