తెలుగు అమ్మాయి బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించినా కూడా పెద్దగా క్రేజ్ దక్కించుకోలేక పోయింది, దాంతో వరుసగా తమిళ్ లో ఆఫర్ల కోసం ప్రయత్నం చేసి అక్కడ సక్సెస్ అయింది.
అక్కడ పలు సినిమాల్లో నటించి మంచి పేరు ను సొంతం చేసుకున్న బిందు మాధవి మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.అందులో భాగంగానే ఇలా అందాల ఆరబోత చేస్తుంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియా లో ఈ అమ్మడి యొక్క అందాల ఆర బోత కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.కొందరు ఇంత అందం గా ఉన్న బిందు మాధవి ఎందుకు హీరోయిన్ గా స్టార్ అవ్వలేక పోయింది అంటూ ప్రశ్నిస్తుంటే మరి కొందరు తెలుగు అమ్మాయి అవ్వడం వల్లే తెలుగు ఫిలిం మేకర్స్ ఆమెను పట్టించు కోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి బిందు మాధవి మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇలా హార్ట్ ఫోటో షూట్ లను రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది.బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి కి ఆఖరి కూడా కలిసి వచ్చి రాబోయే రోజుల్లో వరుసగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ సమాచారం అందుతుంది.
ప్రస్తుతం ఈ అమ్మడి చేతి లో రెండు సినిమాలు ఉన్నాయని అవి చర్చల దశలో ఉన్నాయని వచ్చే ఏడాది షూటింగ్ జరిగే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.ముందు ముందు ఈమె మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.
తమిళ్ నుండి వస్తున్న ఆఫర్లను కూడా ఈమె పరిశీలిస్తుందట.మొత్తానికి టాలీవుడ్ లో బిజీ అవ్వడం కోసం పడరాని పాటలను ఈ అమ్మడు పడుతుంది అంటూ ఈ ఫోటోలను చూసిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు.







