టాలీవుడ్ లో వచ్చే నెల సందడి వాతావరణం నెలకొనబోతుంది.ఎందుకంటే వచ్చే నెల అక్టోబర్ 5న దసరా కావడంతో వరుసగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
మరి ఆ లిష్టులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాదర్ ఒకటి.
తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతుంది.
చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ న రిలీజ్ కాబోతుంది.పండుగ సీజన్ లో రాబోతున్న ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి.

మరి ఆ అంచనాలను డబుల్ చేయడానికి మేకర్స్ కూడా వరుస అప్డేట్ లు ప్రకటిస్తూ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ అనౌన్స్ చేసారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ లపై ఫస్ట్ సింగిల్ ప్లాన్ చేసినట్టు పోస్టర్ ద్వారా తెలుస్తుంది.ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపి ఫుల్ సాంగ్ ను ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
మరి ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక థమన్ సంగీతం ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ .బి .చౌదరి నిర్మిస్తున్నారు.